Greater Warangal BRS: గ్రేటర్ వరంగల్ లో బీఆర్ఎస్ కు భారీ షాక్.. కాంగ్రెస్‌లోకి మేయర్, కార్పొరేటర్లు..
Greater Warangal BRS: రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా చెప్పుకునే గ్రేటర్ వరంగల్ లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే కొందరు కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ లో చేరగా తాజాగా నగర మేయర్ గుండు సుధారాణి, మరి కొందరు కార్పొరేటర్లు హస్తం పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు.