Jaahnavi Kandula Case : జాహ్నవి కందుల కేసులో అధికారిపై నేరాభియోగాల్లేవ్& ఇదెక్కడి న్యాయమని కేటీఆర్ ఆగ్రహం
Jaahnavi Kandula Case : అమెరికాలో ఏపీకి చెందిన కందుల జాహ్నవి మృతి కేసులో ప్రమాదానికి కారణమైన పోలీస్ అధికారిపై నేరాభియోగాలు మోపడంలేదని అక్కడి అధికారులు తెలిపారు. ఈ విషయంపై విదేశాంగ మంత్రి, యూఎస్ అంబాసిడర్ స్పందించి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.